News February 18, 2025

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

image

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937 
➤ పురుష ఓటర్లు: 3,100 
➤ మహిళా ఓటర్లు:1,837 
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29 
➤ పోలింగ్ తేదీ: 27.02.2025 
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025

Similar News

News March 12, 2025

VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

image

సారా ర‌హిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో నాటుసారా నిర్మూల‌న స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని బుధ‌వారం నిర్వ‌హించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబ‌రు 14405 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సూచించారు.

News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.

News March 12, 2025

VZM: ఉల్లాస్ కార్యక్రమం.. 3 గంటల పాటు పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు 3 గంటల పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బీఆర్‌ అంబేడ్కర్ తెలిపారు. ఈ పరీక్ష 23న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందని, ఈ మధ్యలో ఏ 3 గంటలైనా అభ్యర్థులు పరీక్షను రాయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సుమారు 48 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారని, 875 పాఠశాలలను గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!