News September 5, 2024
విజయనగరం జిల్లాలో గంజాయి కేసులో ఏడుగురు అరెస్ట్

డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామంలో MVGR ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో ఉన్న నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. స్థానిక పోలీసులు వచ్చిన పక్కా సమాచారం మేరకు రైడ్ చేయగా గంజాయి అమ్ముతున్న ముగ్గురితో పాటు, తాగుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
Similar News
News October 23, 2025
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 23, 2025
సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లోఅప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.
News October 23, 2025
VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.