News April 4, 2025
విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు వీరికే

విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్పర్సన్గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.
Similar News
News October 31, 2025
విజయనగరంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా విజయనగరంలో ఘనంగా కాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ..దేశ భద్రత, శాంతి కాపాడడంలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. పోలీసు విధుల్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జోహార్లు తెలిపారు.
News October 31, 2025
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 31, 2025
VZM: పాడుబడిన ఇంటి గోడ కూలి వృద్ధురాలి మృతి

విజయనగరం పట్టణ పరిధి గోకపేట రామాలయం పక్కన పాడుబడిన ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతురాలు రెయ్యి సన్యాసమ్మ కుమారుడు కాళీ ప్రసాద్ వివరాల ప్రకారం.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా దారిలో పాడుబడిన ఇంటి గోడ కూలి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి ఘటనా స్థలికి వెళ్లారు.


