News September 11, 2024
విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా..!
కొత్తవలస మండల కేంద్రంలోని సంతపాలెంలో పశువులను అక్రమంగా నిర్బంధించిన గోడౌన్‌పై సీఐ షణ్ముఖరావు మంగళవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు ఉంచిన 108 పశువులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గొటివాడ ఎర్రిబాబు, గొటివాడ నవీన్, ఐ.దేవుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News October 10, 2024
దుర్గాదేవి అవతారంలో పైడితల్లి అమ్మవారు
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల అమ్మవారి వనం గుడిలో దుర్గాష్టమి అర్చకులు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News October 10, 2024
గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు
దసరా పండగ రోజుల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 16 వరకు గుంటూరు-రాయగడ(17243), ఈనెల 11 నుంచి 17 వరకు రాయగడ-గుంటూరు (17244) రైళ్లకు రెండు సాధారణ, రెండు స్లీపర్ బోగీలు జత చేయనున్నామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. >Share It
News October 10, 2024
రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: మంత్రి
రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి పట్ల గురువారం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని కొనియాడారు. పుట్టు కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.