News May 4, 2024
విజయనగరం జిల్లాలో మహిళలే మహా రాణులు..!

ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921 మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు 7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ దగ్గర పడుతుండడంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు.
Similar News
News October 27, 2025
వచ్చేనెల సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నవంబర్ 1, 2వ తేదీల్లో స్థానిక రాజీవ్ స్టేడియంలో జరుగనున్నాయని జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ముందుగా ప్రకటించిన తేదీలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేయబడినట్లు వివరించారు. అర్హులైన ఉద్యోగులు గమనించి ఈ పోటీలకు హాజరు కావాలని సూచించారు.
News October 27, 2025
తీర ప్రాంతాల్లో పర్యటించిన విజయనగరం కలెక్టర్, ఎస్పీ

భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ సోమవారం పర్యటించారు. తుఫాను పరిస్థితులను సమీక్షించారు. మత్స్యకారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
News October 27, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.


