News May 4, 2024
విజయనగరం జిల్లాలో మహిళలే మహా రాణులు..!
ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921 మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు 7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ దగ్గర పడుతుండడంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు.
Similar News
News November 7, 2024
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
విజయనగరానికి చెందిన కుమిలి సురేశ్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు వెల్లడైందన్నారు.
News November 7, 2024
VZM: టూరిజం హోటల్స్ ఏర్పాటుపై IHCL బృందం పరిశీలన
విజయనగరం జిల్లాలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థకు చెందిన IHCL ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలో గురువారం పర్యటించి పలు ప్రాంతాల్లో పర్యాటక హోటల్స్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసింది. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను కలెక్టరేట్లో కలిసి జిల్లాలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.
News November 7, 2024
విజయనగరం YCP ఎమ్మెల్సీ అభ్యర్థిగా శంబంగి నామినేషన్
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్‌కు కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి వద్ద శంబంగి ప్రమాణం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.