News March 13, 2025
విజయనగరం జిల్లాలో హైవేపై 64 సీసీ కెమెరాలు: కలెక్టర్

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు 64 సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. తన ఛాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 34కి.మీ. రోడ్డుపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాల అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చూడాలన్నారు.
Similar News
News March 16, 2026
VZM: కలెక్టరేట్‌లో ప్రజల నుండి 233 వినతుల స్వీకరణ

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 233 వినతులు అందగా అందులో 130 రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం సహించబోమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
News March 16, 2026
VZM: 22ఏ నిషేధిత జాబితా నుంచి 13 మంది రైతులకు విముక్తి

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన 13 మంది రైతులకు ఆయన ఉత్తర్వులు అందజేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు రికార్డులు పరిశీలించి భూములు ప్రభుత్వానికి సంబంధించినవి కావని నిర్ధారించారు.
News March 16, 2026
VZM: పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షకు 455 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 32 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.


