News July 15, 2024
విజయనగరం జిల్లాలో 83 పోస్టల్ ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో పోస్టల్లో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. విజయనగరం డివిజన్లో 43, పార్వతీపురం డివిజన్లో 40 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. >Share It
Similar News
News December 9, 2025
VZM: మహిళల కోసం ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనం

విజయనగరం కలెక్టరేట్లో మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీస్, చట్ట సహాయం, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు తెలిపారు. 24/7 పనిచేసే ఈ వాహనాలు టోల్ ఫ్రీ నంబర్ 181 ద్వారా మహిళలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News December 9, 2025
VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


