News July 13, 2024

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్‌గా మలికా గర్గ్‌ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.

Similar News

News November 17, 2025

VZM: ‘సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ’

image

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.

విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు: మంత్రి

image

రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 8978975284 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.