News December 22, 2024
విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కలిశెట్టి

విజయనగరం క్రికెట్ అసోషియేన్ అధ్యక్షుడిగా ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పెనుమత్స సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట లక్ష్మి పతిరాజు, జాయింట్ సెక్రటరీగా దంతులూరి సీతారామరాజు, కోశాధికారిగా సూర్య నారాయణ వర్మ, అపెక్స్ మెంబర్‌గా పిన్నింటి సంతోష్ కుమార్, ప్లేయర్ మెంబర్‌గా కొండపల్లి పైడితల్లి నాయుడు, మహిళా ప్లేయర్ మెంబర్‌గా పాకలపాటి విజయలక్ష్మి ఎన్నికయ్యారు.
Similar News
News November 24, 2025
రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
News November 24, 2025
డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.