News December 22, 2024

విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కలిశెట్టి

image

విజయనగరం క్రికెట్ అసోషియేన్ అధ్యక్షుడిగా ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పెనుమత్స సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట లక్ష్మి పతిరాజు, జాయింట్ సెక్రటరీగా దంతులూరి సీతారామరాజు, కోశాధికారిగా సూర్య నారాయణ వర్మ, అపెక్స్ మెంబర్‌గా పిన్నింటి సంతోష్ కుమార్, ప్లేయర్ మెంబర్‌గా కొండపల్లి పైడితల్లి నాయుడు, మహిళా ప్లేయర్ మెంబర్‌గా పాకలపాటి విజయలక్ష్మి ఎన్నికయ్యారు.

Similar News

News January 20, 2025

డయేరియా కేసులపై మంత్రి కొండపల్లి ఆరా   

image

బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 20, 2025

బొబ్బిలి: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్‌ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News January 20, 2025

విజయనగరం మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.