News March 14, 2025

‘విజయనగరం జిల్లా రైతులకు రూ.2.5కోట్ల రాయితీ’

image

విజయనగరం జిల్లాలో అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.2.5కోట్లు సబ్సిడీ ఇవ్వనుందని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు చెప్పారు. గురువారం తెర్లాం వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్ప్రింక్లర్లు, పవర్ స్ప్రింక్లర్లు, రోటోవీటర్లు, ట్రాక్టర్ పరికరాలు 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

Similar News

News November 4, 2025

యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

image

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.

News November 4, 2025

ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

image

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.