News March 20, 2025
విజయనగరం జిల్లా వాసులకు అలెర్ట్

విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C, తెర్లాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి.
Similar News
News December 21, 2025
విజయనగరంలో పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

విజయనగరం పట్టణంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 1,172 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న సుమారు 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
News December 21, 2025
VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.
News December 21, 2025
భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.


