News December 22, 2024

విజయనగరం జిల్లా DM&HOగా జీవనరాణి

image

విజయనగరం  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ జీవనరాణి నియమితులయ్యారు. DM&HO కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన ఎస్.భాస్కరరావు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు.

Similar News

News December 21, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.

News December 21, 2025

భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

image

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.