News December 22, 2024
విజయనగరం జిల్లా DM&HOగా జీవనరాణి
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ జీవనరాణి నియమితులయ్యారు. DM&HO కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన ఎస్.భాస్కరరావు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు.
Similar News
News January 17, 2025
VZM: జిల్లాలో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు
విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
News January 17, 2025
పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
News January 17, 2025
గడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్ రిప్లై
వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్‌ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.