News August 14, 2024
విజయనగరం జేసీగా సేతు మాధవన్

పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్న సేతు మాధవన్ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపై కొంత వరకు అవగాహన ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష

రాష్ట్రంలో MSME రంగ అభివృద్ధి, క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. MSMEలకు అందిస్తున్న ప్రోత్సాహం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
News November 20, 2025
VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 20, 2025
భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.


