News June 23, 2024
విజయనగరం జోన్ పరిధిలో లీజ్‌కు ఆర్టీసీ స్థలాలు

విజయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న తొమ్మిది ఆర్టీసి ఖాళీ స్థలాలను లీజ్‌పై ఔత్సాహిక వ్యాపారస్తులకు ఇవ్వనున్నామని డిప్యూటీ సిటీఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఖాళీ స్థలాల లీజుకు ఆసక్తి చూపుతున్న శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 26 మధ్యాహ్నం 2 గంటల లోపు జోనల్ వర్క్ షాప్ వద్ద దరఖాస్తులు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు.
Similar News
News February 22, 2026
VZM: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం (D) సంతకవిటి (M) పోతురాజుపేటకి చెందిన ఐ.దివ్య (22)కి మార్చి 7న వివాహం నిశ్చయించారు. అయితే యువతి ఈనెల 20న గడ్డిమందు తాగింది. వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేకనే దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
News February 22, 2026
బొబ్బిలి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

బొబ్బిలి పట్టణం కుమ్మరివీధిలో ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేశ్ అనుమానంతో వేధిస్తున్నాడు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు CI నారాయణరావు చెప్పారు.
News February 22, 2026
VZM: బిల్లులు ఎప్పుడు?

విజయనగరం జిల్లాలో పెండింగ్ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


