News August 16, 2024
విజయనగరం: ట్రైన్ ఢీకొని యువకుడు మృతి
రైలు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు శుక్రవారం విజయనగరం రైల్వే పోలీసులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బలిరెడ్డి సురేష్ (26) పెద్దామనాపురంలోని తన నాన్నమ్మ ఇంటికి వెళుతుండగా పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టిందని తెలిపారు. దీంతో అతను తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 8, 2024
ఏయూ అనుబంధ కళాశాలలకు రేపు సెలవు
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.
News September 8, 2024
నాగావళి వరదపై అధికారులను అప్రమత్తం చేసిన CM
నాగావళి వరద పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో తోటపల్లి ప్రాజెక్టు వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 103.95 మీటర్ల నీటిమట్టం ఉంది. ఒడిశా నుంచి 2,180 క్యూసెక్కుల వరద నీరు వస్తుడడంతో రెండు గేట్లు ఎత్తి 1,851 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్న అధికారులు తెలిపారు.
News September 8, 2024
VZM: ‘భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
భారీ వర్షాల పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వంతెనలు, కాజ్ వే ల పై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.