News August 21, 2024

విజయనగరం డీఈవో సూచనలు

image

ఇన్‌స్పైర్ మనక్ కోసం ప్రాజెక్టులు తయారు చేసి.. ఆ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని విజయనగరం డీఈవో ప్రేమకుమార్ సూచించారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులను ఈనెల చివరిలోగా నమోదు చేయాలన్నారు. అన్ని పాఠశాలల ప్రాజెక్టులను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాల నుంచి 5, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు ఉండాలని సూచించారు.

Similar News

News September 20, 2024

‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన’

image

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా చేపడుతున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News September 19, 2024

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి

image

జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్ల‌న్నింటినీ మార్చి నెలాఖ‌రులోగా శ‌త‌శాతం పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల‌ను కాలవ్య‌వ‌ధి ప్ర‌కారం పూర్తిచేయాల‌ని స్ప‌ష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంక‌లాం తదితర ఇళ్ల కాల‌నీలను సంద‌ర్శించి ఇళ్ల నిర్మాణ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

News September 19, 2024

ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ

image

ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.