News November 12, 2024

విజయనగరం డీవీఈవోకి సీఎం చేతుల మీదుగా అవార్డు

image

విజయనగరం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భీమ శంకర్రావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపల్ క్యాడర్లో ఈ అవార్డు పొందినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అవార్డు పొందిన డీవీఈవోను పలువురు ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు అభినందించారు.

Similar News

News March 10, 2026

విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

image

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.

News March 10, 2026

VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

image

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.

News March 10, 2026

నాటు తుపాకుల నియంత్రణకు ‘కార్డన్ సెర్చ్’: ఎస్పీ

image

జిల్లాలో నాటు తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణకు గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించాలని SP ఎ.ఆర్. దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకులు లభ్యమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఆయుధాల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.