News October 16, 2024
విజయనగరం డ్వాక్రా బజార్‌ను సందర్శించిన మన్యం జిల్లా కలెక్టర్

విజయనగరంలో ట్యాంక్ బండ్ సమీపంలో, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చి అమ్మకాలు చేపడుతున్న మహిళా సంఘాలు సభ్యులతో మాట్లాడి ఆదాయం ఎంత వస్తుంది అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, DRDA పీడీ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
విశాఖ రేంజ్ ఐజీతో విజయనగరం ఎస్పీ భేటీ

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని ఐజీ గోపినాథ్ జట్టి పేర్కొన్నారు.
News January 2, 2026
జనవరి 17న “స్వచ్ఛ రథం” పథకం ప్రారంభం: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణ లక్ష్యంగా “స్వచ్ఛ రథం” పథకాన్ని జనవరి 17న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పొడి చెత్తను సేకరించి, వస్తు మార్పిడి విధానంలో నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపారు. దీంతో చెత్త వేర్పాటు అలవాటు పెరిగి గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు.
News January 1, 2026
రహదారి నిబంధనలను విధిగా పాటించాలి : కలెక్టర్

రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు నిబంధనలు పాటించకపోవడమే కారణమని తెలిపారు. వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.


