News January 30, 2025
విజయనగరం నుంచి కుంభమేళాకు ఆర్టీసీ బస్సు

మహా కుంభమేళాకు విజయనగరం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు డీఎం శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి వయా భువనేశ్వర్, కోణార్క్, పూరీ, ప్రయాగ రాజ్, వారణాసి మీదుగా అయోధ్యకు వెళ్ళి తిరిగి మళ్లీ 13న విజయనగరం చేరుకుంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఆన్‌లైన్, బస్టాండ్ కౌంటర్ వద్ద టికెట్ సౌకర్యం పొందవచ్చన్నారు.
Similar News
News February 7, 2025
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: VZM SP

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
News February 6, 2025
VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
News February 6, 2025
మంత్రి కొండపల్లికి మూడో ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు పొందారు.