News February 21, 2025

విజయనగరం నుంచి కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణాధికారి సీ హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఆదరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 23, 2025

రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియ: JC

image

రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న రావాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

News February 23, 2025

VZM: 12 సెంటర్లు.. 6,265 మంది అభ్యర్థులు

image

జిల్లాలో ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని జేసీ సేతు మాధవన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,265 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News February 23, 2025

VZM: సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

image

విజయనగరం సబ్ జైలును అదనపు సివిల్ న్యాయమూర్తి టీవీ రాజేష్  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు కానీ ఎటువంటి వివక్షత చూపించరాదని సూచించారు. ఖైదీల పట్ల వివక్షత చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని సందర్శించారు.

error: Content is protected !!