News May 28, 2024

విజయనగరం: నేడు అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం

image

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించే నిమిత్తం పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు కూడా పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలిసిన నియమ నిభందనలు పార్టీల నేతలకు వివరిస్తారు.

Similar News

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News September 30, 2024

విజయనగరం ఉత్సవాల్లో 12 చోట్ల వినోద కార్యక్రమాలు

image

అక్టోబర్ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో 12 ప్రధాన వేదికల వద్ద వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. వేదికల వద్ద జిల్లా అధికారులను ఇన్ ఛార్జ్‌లుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమాల పట్ల వారి ఆసక్తి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్ మెంబర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.

News September 30, 2024

లేజ‌ర్ షో ద్వారా విజయనగరం చరిత్ర

image

కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కోట చుట్టూ వున్న కంద‌కాల‌ను స్వ‌చ్ఛ‌మైన నీటితో నింపి లాన్‌తో అందంగా తీర్చిదిద్దాల‌న్నారు. కోట గోడ‌ను ఆనుకొని వెన‌క‌వైపు ఉన్న ఖాళీ స్థ‌లంలో సంద‌ర్శ‌కులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కోట‌కు ద‌క్షిణం వైపు ప్ర‌తిరోజూ లైట్ అండ్ షో నిర్వ‌హించి విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌, వైభ‌వాన్ని లేజ‌ర్ షో ప్రదర్శిస్తారు.