News May 20, 2024

విజయనగరం: నేడే పైడితల్లమ్మ దేవరోత్సవం

image

నేడు జరగనున్న పైడితల్లి అమ్మవారి దేవరోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ఆలయ ప్రదక్షిణ అనంతరం సా.5గంటలకు ఊరేగింపుగా హుకుంపేట తీసుకొస్తారు. అక్కడ నుంచి ఘటాలతో మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట, పార్కుగేటు, శివాలయం వీధి మీదుగా ఊరేగింపుతో మూడులాంతర్ల చదురుగుడికి తీసుకొస్తారు. వచ్చే రెండువారాల వరకు అమ్మవారు అక్కడే పూజలందుకుంటారు.

Similar News

News December 2, 2024

VZM: లీగల్ వాలంటీర్లుగా అవకాశం

image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి TV రాజేశ్ కోరారు. పదోతరగతి చదివి తెలుగు చదవడం, రాయడం రావాలన్నారు. క్రిమినల్ కేసులు ఉండరాదని సూచించారు. శిక్షణ కాలంలో గాని, శిక్షణ పూర్తైన తరువాత గాని ఎటువంటి జీతభత్యాలు ఉండవన్నారు. కేవలం సమాజ సేవ దృక్పథం గల వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News December 1, 2024

మైనింగ్ కంపెనీ‌పై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ

image

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.

News December 1, 2024

VZM: అలా జరిగి ఉంటే వాళ్లు బతికే వాళ్లేమో..!

image

భోగాపురం రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన అభినవ్ భార్య మణిమాల విశాఖలో పరీక్ష రాయాల్సి ఉంది. అభినవ్ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ల మేనమామ అమెరికా నుంచి వస్తుండటంతో రిసీవ్ చేసుకోవడానికి విశాఖకు బయల్దేరారు. ‘మేమూ నీతో వస్తాం’ అంటూ మణిమాల, అభినవ్ అదే కారులో బయల్దేరారు. ఒకవేళ ఆ భార్యాభర్త వేరుగా విశాఖకు బయల్దేరి ఉంటే బతికేవారేమో. విధి ఆడిన నాటకంలో ఇలా చనిపోయారని బంధువులు వాపోయారు.