News December 11, 2024

విజయనగరం పట్టణంలో ఆక్రమణలు తొలగింపు 

image

విజయనగరంలోని సాలిపేట రహదారిలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో పట్టణ ప్రణాళిక సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్సీఎస్ థియేటర్ రోడ్‌లో అనధికార ప్రకటన బోర్డులను తొలగించారు. సాలిపేట రోడ్‌లో అనధికారికంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకున్నారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

Similar News

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శృంగవరపుకోట మండలం సన్యాసయ్య పాలెం గ్రామానికి చెందిన బర్ల సత్యవతమ్మ (85) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని ఎస్.కోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 16వ తేదీన గుడికి వెళ్లి పూజ చేస్తున్న సమయంలో దీపం తగిలి చీరకు నిప్పు అంటుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

News January 21, 2025

A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స

image

రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ ఘటనలో నష్టం జరిగిందని బాధితుడికి ప్రజల సొమ్ము ఇవ్వడమేమిటన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు.