News June 1, 2024
విజయనగరం: పూసపాటిరేగ మండలంలో అత్యధిక వర్షపాతం

విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జిల్లాలో అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, విజయనగరంలో 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శృంగవరపుకోట మండలంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 24, 2025
బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.
News April 23, 2025
10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.
News April 23, 2025
VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.