News December 6, 2024
విజయనగరం: పెరిగిన గుడ్డు ధర..!

గుడ్డు ధర భారీగా పెరిగింది. విజయనగరం రైతు బజారులో రూ.6.34కు విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో రూ.7 అమ్ముతున్నారు. కాగా.. విజయనగరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. (KGలో) వంకాయ రూ.35, టమాటా రూ.45-48, బెండ రూ.30, కాకర రూ.35, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.38, క్యారెట్ రూ.55-70, దొండకాయలు రూ.30కి అమ్ముతున్నారు. మరి మీ దగ్గర కూరగాయలతో పాటు గుడ్డు ధర ఎంత ఉందో కామెంట్ చెయ్యండి.
Similar News
News December 19, 2025
విజయనగరం ఎస్పీ దామోదర్కు అవార్డు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా మాజీ MPP వీరయ్య చౌదరి హత్య కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ (అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ) ABCD – Award for Best in Crime Detection అవార్డు అందుకున్నారు. రాష్ట్ర DGP కార్యాలయంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కేసులో 60 క్రైమ్ టీములు ఏర్పాటు చేసిన ఎస్పీ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
News December 19, 2025
VZM: రైతుల ఖాతాల్లో రూ.373 కోట్ల జమ

ఖరీఫ్ 2025-26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.
News December 19, 2025
జిల్లాలో 1.99 లక్షల మంది చిన్నారులే లక్ష్యం: VZM DMHO

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.జీవినరాణి తెలిపారు. స్థానిక కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. 1180 బూతులు, 2360 బృందాలు ఏర్పాటు చేయగా, 2,45,667 OPV డోసులు సిద్ధంగా ఉంచామన్నారు.


