News December 26, 2024
విజయనగరం: పోలీస్ ఉద్యోగమే లక్ష్యం
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజ్జీ, రాజీవ్, అయోధ్య, మైదానాలన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. వర్షంతో మైదానాలు బురదమయం కాగా ఖాకీ కొలువు కోసం యువత అవరోధాలను అధిగమించి ప్రాక్టీస్ ముమ్మరం చేస్తున్నారు. వీరికి ఈనెల 30వ తేదీ నుంచి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో ఈవెంట్స్ జరగనున్నాయి.
Similar News
News January 24, 2025
విశాఖలో విజయనగరం విద్యార్థి మృతి
విజయనగరం జిల్లా యువకుడు గంభీరం డ్యామ్‌లో మృతి చెందాడు. గరివిడి మండలం కందిపేటకు చెందిన మీసాల నాని విశాఖలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
VZM: ‘పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు’
జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” ను శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఐదుగురు సిబ్బంది నుంచి వినతులు విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.
News January 24, 2025
VZM: జిల్లాలో 431 గోకులాల నిర్మాణం పూర్తి: కలెక్టర్
జిల్లాలో మొదటి విడతలో భాగంగా 996 గోకులాలు మంజూరు చేయగా, వీటిలో 431 నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ అంబేడక్కర్ తెలిపారు. సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత డ్వామా APOలపై ఉందని స్పష్టం చేశారు. రెండో విడత కింద ఫిబ్రవరి మొదటి వారంలో మరో 1000 గోకులాల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 2 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు.