News April 29, 2024

విజయనగరం : ప్రమాదానికి గురైన ఆర్మీ జవాన్

image

విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 21, 2025

VZM: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్‌ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

News December 21, 2025

విజయనగరంలో పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

విజయనగరం పట్టణంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 1,172 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న సుమారు 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

News December 21, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.