News April 29, 2024

విజయనగరం : ప్రమాదానికి గురైన ఆర్మీ జవాన్

image

విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

image

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News April 13, 2026

200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో జైలు: ఎస్పీ

image

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.