News November 11, 2024
విజయనగరం: ప్రాణం తీసిన చుట్ట..!

దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన సారిక సింహాచలం అనే వృద్ధురాలు చుట్ట కాల్చుకునే క్రమంలో చీరకు నిప్పు అంటుకుంది. వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె తమ్ముడు రౌతు సింహాచలం తెలిపారు. ఈ ఘటనపై పెదమానాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
విజయనగరం ఉత్సవాలకు రూ.2.02 కోట్ల విరాళాలు: కలెక్టర్

విజయనగరం ఉత్సవాలకు 435 మంది దాతలు మొత్తం రూ.2.02 కోట్లు విరాళంగా అందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. వాటిలో రూ.1.41 కోట్లు ఉత్సవాల నిర్వహణకు వినియోగించగా.. మిగిలిన రూ.61 లక్షలు వచ్చే ఏడాది ఉత్సవాలకు ఉంచినట్లు ఆయన వివరించారు. 12 వేదికలపై సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ఉత్సవాల విజయానికి సహకరించిన దాతలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 22, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రీ-ఆడిట్ పెండింగ్ ఫిర్యాదులను రెండు వారాల్లో 20% లోపు తగ్గించాలని, SLA గడువు దాటకూడదని స్పష్టం చేశారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే శాతం 10% కంటే ఎక్కువ కాకుండా చూడాలని సూచించారు.
News October 22, 2025
VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.