News September 29, 2024
విజయనగరం: ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య
పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు(39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఎన్.ఏం.ఆర్‌గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 15, 2024
సిరిమానోత్సవంలో ప్రజా ప్రతినిధుల సందడి
పైడితల్లి సిరిమానోత్సవ ఘట్టంలో పలువురు ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, తదితరులు సిరిమానుతో పాటు తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిరిమాను ఘట్టం ముగింపు వరుకు పర్యటించి సందడి చేశారు.
News October 15, 2024
విజయనగరంలో RRR సెల్ఫీ
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజయనగరం పట్టణంలో మంగళవారం సందడి చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరి మానోత్సవానికి విచ్చేసిన ఆయన అమ్మవారి దర్శనం అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన సిరిమానోత్సవంలో పలువురు కోరిక మేరకు సెల్ఫీలు దిగి సందడి చేశారు.
News October 15, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.