News April 28, 2024
విజయనగరం: మద్యం మత్తులో విధులకు ఉద్యోగి

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిఆస్పత్రిలో తాత్కాలిక పద్ధతిపై పని చేస్తున్న ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. సదరు ఉద్యోగి ఓపీ విభాగంలో పని చేస్తున్నాడు. ఓపీ చీటీ కావాలని రోగులు అడగగా ఉద్యోగి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.
Similar News
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News October 20, 2025
ప్రతి కుటుంబానికి రూ.15వేల లబ్ది: కలెక్టర్

జిల్లాలో సుమారు నెల రోజులుగా కొనసాగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజలలో విశేష స్పందన వచ్చిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గించడంతో 98 శాతం ఉత్పత్తులు ధరలు తగ్గాయని తెలిపారు. పారదర్శక పన్ను విధానం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం రూ. 15 వేలు లబ్ది చేకూరుతుందన్నారు.
News October 19, 2025
బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.