News October 12, 2024
విజయనగరం: మద్యం షాపుల డ్రా స్థలం మార్పు

నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపుల డ్రా స్థలం మార్పు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ నాథుడు తెలిపారు. సుజాత కన్వెన్షన్ హాల్లో నిర్వహించాల్సిన డ్రా విధానం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 14న కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థల మార్పును దరఖాస్తుదారులు గమనించాల్సిందిగా ఆయన సూచించారు.
Similar News
News October 17, 2025
రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

బ్యాంకుల నుంచి రుణాలు అందజేయడం చేస్తూనే మరో వైపు ఇచ్చిన రుణాలను రికవరీ చేయించడం కూడా అధికారుల ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రుణాలను అందజేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపాలని, అప్పుడే పథకాలు విజయవంతంగా నడుస్తాయని అన్నారు. అదే సమయంలో రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు.
News October 17, 2025
దివిస్ కంపెనీలో విషవాయివుల లీక్

భీమిలి సమీపంలోని దివిస్ లేబరెటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్స్ అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు వినయ్ కుమార్, హేమంత్ని స్థానిక ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అపోలోకి తరలించారు.
News October 16, 2025
లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలి: VZM SP

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దర్యాప్తు కేసులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.