News December 26, 2024

విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 14, 2025

ఎల్.కోట: చెరువులో పడి వ్యక్తి మృతి

image

ఎల్.కోట మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మల్లివీడుకు చెందిన వీరనాగా పాత్రుడు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సాయత్రం బహిర్భూమికి వెళ్లిన పాత్రుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News January 13, 2025

గుమ్మలక్ష్మీపురం: బాలిక ఆత్మహత్య

image

గుమ్మలక్ష్మీపురం మండలం జర్న గ్రామానికి చెందిన జీలకర్ర స్వాతి అనే బాలిక (16) ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున జరిగింది. గతంలో బొబ్బిలిలో బాలిక పై లైంగిక దాడి జరిగిందని పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమెండ్‌కు తరలించారు. ఎల్విన్ పేట ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 13, 2025

VZM: 109 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు:ఎస్పీ

image

జిల్లాలో గతంలో పేకాట, కోడిపందాలతో ప్రమేయం ఉన్న 109 మంది వ్యక్తులను గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడి పందేలు నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.