News November 12, 2024
విజయనగరం: మూడు జిల్లాలకు ఒక్కరే..!

వైద్య సేవ జిల్లా సమన్వయకర్త పోస్టు ఖాళీగా ఉండి నెలరోజులు గడుస్తుంది. విజయనగరం,విశాఖపట్నం,పార్వతీపురం జిల్లాలకు అప్పారావు ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాల బాధ్యతలు చూడడం అనేది ఏ అధికారికైనా కత్తి మీద సాము వంటిదే.వైద్య సేవ ఆసుపత్రుల పరిశీలన, సేవల తీరుపై ఆరా తీయడం, సకాలంలో వైద్యం అందేలా చూడాలి. జిల్లాకు సమన్వయకర్తను నియమిస్తే సకాలంలో వైద్యసేవలు అందుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 10, 2026
విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.
News March 10, 2026
VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.
News March 10, 2026
నాటు తుపాకుల నియంత్రణకు ‘కార్డన్ సెర్చ్’: ఎస్పీ

జిల్లాలో నాటు తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణకు గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించాలని SP ఎ.ఆర్. దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకులు లభ్యమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఆయుధాల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.


