News August 29, 2024

విజయనగరం మెడికల్ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభం

image

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆల్ఇండియా కోటాలో 22 సీట్లను వైద్య కళాశాలకు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రవేశాలు ముందుగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నలుగురు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల, ఆర్‌ఎంఈఓ డాక్టర్ ఎన్.సురేశ్ బాబు ఆడ్మిషన్ ప్రక్రియ నిర్వహించారు.

Similar News

News July 11, 2025

సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు విజృంభించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, వివిధ అంశాల‌పై స‌మీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజ‌నల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా క‌ట్టుధిట్టంగా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

News July 11, 2025

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

image

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

News July 10, 2025

VZM: 2,232 పాఠశాలలు, కాలేజీల్లో మీటింగ్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ గురువారం జరిగింది. జిల్లాలోని 2,232 పాఠశాలల్లో 2,10,377 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని 180 జూనియర్ కళాశాల్లోనూ ఈ మీటింగ్ జరిగింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు టీచర్లు, లెక్చరర్లు వివరించారు..