News May 11, 2024

విజయనగరం: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎన్వీ రమణ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మూతపడతాయన్నారు. అనధికార మద్యం విక్రయాలు చేసినా.. నిల్వలు చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 13, 2025

వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 13, 2025

MSP సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలి: VZM SP

image

క్షేత్ర స్థాయిలో MSPల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. విధి నిర్వహణ పట్ల MSPలకు దిశా నిర్దేశం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో వారి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని కోరారు. ప్రతీ వారం MSPలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలను తెలుసుకోవాలన్నారు.

News February 12, 2025

VZM: హత్యకు గురైన MRO భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

image

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.

error: Content is protected !!