News June 19, 2024
విజయనగరం: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ రవివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం అందిన సమాచారం మేరకు గజపతినగరం సమీపంలో పట్టాలపై వున్న మృతదేహాన్ని పరిశీలించామన్నారు. రైలు నుంచి జారీ పడటంతో వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని ఎస్ఐ తెలిపారు. సమాచారం తెలిసిన వారు విజయనగరం, బొబ్బిలి జీఆర్పీ స్టేషనుకు తెలపాలని కోరారు.
Similar News
News September 20, 2024
ప్రారంభమైన దుర్గ్ – విశాఖ వందే భారత్
నూతనంగా ఇటీవల ప్రారంభించిన విశాఖ – దుర్గ్ వందే భారత్ ట్రైన్ దుర్గ్ నుంచి శుక్రవారం ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి పార్వతీపురం 11:38 నిమిషాలకు చేరుకుంది. ఈ ట్రైన్ వారంలో గురువారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బొబ్బిలిలో నిలుపుదలకు స్థానిక MLA అడిగినప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ట్రైన్ తిరిగి విశాఖలో మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దుర్గ్ బయలుదేరనుంది.
News September 20, 2024
‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన’
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా చేపడుతున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News September 19, 2024
మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి
జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లన్నింటినీ మార్చి నెలాఖరులోగా శతశాతం పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంకలాం తదితర ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు.