News November 15, 2024

విజయనగరం రైల్వే ట్రాక్‌పై మృతదేహం 

image

విజయనగరం రైల్వే స్టేషన్ యార్డులో రూట్ నంబర్ 9లో సుమారు 30 -35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. పింక్ కలర్ రెడీమేడ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బిస్కెట్ కలర్ ఫ్యాంట్, కుడి మోచేతి పైన “SINVREN “అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఇతడి ఆచూకీ తెలిసినవారు స్థానిక స్టేషన్లో సంప్రదించాలన్నారు.

Similar News

News October 22, 2025

VZM: ‘గ్రామాల్లో పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలి’

image

ప్రతి నెలా గ్రామాల్లో పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ సమావేశం నిర్వహించారు. SC, ST అత్యాచారాల నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ కాలనీలకు, స్మశానాలకు రహదారులు నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

News October 22, 2025

తెర్లాంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తెర్లాం మండలం చుక్కవలస వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెమలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కడమటి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. బండిపై ఆయన వెనుకున్న అటెండర్ రమణమ్మ తలకు గాయాలయ్యాయి. మరో బండిపై ఉన్న శివాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ సాగర్ బాబు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News October 22, 2025

VZM: ‘సర్దార్ @ 150 కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలి’

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “సర్దార్ @150” కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జరగనున్న ర్యాలీలు, పోటీల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.