News December 9, 2024
విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన గొర్లి రాము జీవనోపాధి కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం పాలు పాకెట్ కోసం వెళ్లిన సమయంలో లారీ ఢీకొనడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. రాము మృతి చెందడంతో దత్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 17, 2025
పార్వతీపురం: పండగ జరుపుకుని వెళ్తూ అనంత లోకాలకు
పార్వతీపురం మన్యం జిల్లా అల్లు వాడకు చెందిన లోలుగు <<15173201>>రాంబాబు<<>>(44) అతని కుటుంబంతో కలిసి పండగ చేసుకుని తిరిగి ఉద్యోగ నిమిత్తం తిరిగి ప్రయాణమయ్యారు. అతని భార్య ఉమాదేవి పాచిపెంటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బైక్‌పై వెళ్తుండగా రాంబాబు, పెద్ద కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న కుమారుడు సూర్య శ్రీహాన్, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 17, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News January 16, 2025
సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సీతానగరం మండలం మరిపివలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు రాంబాబు (44), అతని కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) తమ కుటుంబ కలిసి వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు.