News March 6, 2025

విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐ‌వోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

Similar News

News March 6, 2026

చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో డెడ్ బాడీ కలకలం

image

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.