News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల గమ్యాన్ని కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21 నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 26, 2025
ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.
News November 26, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

ఎనుమాముల మార్కెట్కి బుధవారం మిర్చి తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,000 ధర రాగా.. బుధవారం రూ.17,100 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.19,500 ధర రాగా, ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.14,600 ధర వస్తే.. నేడు రూ.15,100 అయింది.
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.


