News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు వలన పలు రైలు గమ్యాన్ని కుదించడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుంది.
Similar News
News October 24, 2025
‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
News October 24, 2025
‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News October 23, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


