News June 6, 2024
విజయనగరం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్‌పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.
Similar News
News December 10, 2024
VZM: సౌద్ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగాలు
APSSDC ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు https://forms.gle/Xoy8SHAdaZCtugb1A లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి సౌద్ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. >Share it
News December 10, 2024
VZM: ఆరోగ్య శాఖలో కౌన్సిలర్ ఉద్యోగానికి నోటిఫికేషన్
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్రీయ కిశోర స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న హెల్త్ కౌన్సిలర్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO రాణి సోమవారం తెలిపారు. డిగ్రీ సోషల్ వర్క్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, 25 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ vizianagaram.nic.inను సంప్రదించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
News December 9, 2024
ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి: బొత్స
ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ క్యాడర్‌కు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు సమస్యలపై ఈనెల 13న, విద్యుత్ ఛార్జీల మోతపై27న, విద్యార్థుల సమస్యలపై జనవరి 3న సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. నేతలు ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.