News October 29, 2024
విజయనగరం: వైద్య సేవా సిబ్బంది సమ్మె తాత్కాలిక వాయిదా

ఎన్టీఆర్ వైద్య సేవా (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బంది నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విధితమే.వైద్యసేవ సిబ్బంది యూనియన్ నాయకులతో నిన్న సాయంత్రం జరిగిన చర్చల్లో సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లు తీర్చడానికి కొంత సమయం ప్రభుత్వం కోరడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా ప్రెసిడెంట్ జెర్రిపోతుల ప్రదీప్ తెలిపారు. నేటి నుంచి యధావిధిగా రోగులకు సేవలందిస్తారని తెలిపారు.
Similar News
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.
News October 29, 2025
గజపతినగరంలో రోడ్డు ప్రమాదం.. కారు దిగిన కలెక్టర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గజపతినగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బుధవారం గమనించారు. వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తులకు ధైర్యం చెప్పారు. అనంతరం అంబులెన్సును ఏర్పాటు చేయించి తక్షణ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ అవర్‌లో అందించిన సాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని, ప్రాణం కంటే విలువైనది మరేమీ లేదన్నారు.


