News June 17, 2024
విజయనగరం: వైసీపీకి సీనియర్ నేత రాజీనామా

జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.
Similar News
News October 17, 2025
గంజాయి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

2022లో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన నిందితుడు ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువుకావడంతో శిక్ష పడిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. అదే కేసులో మరో ఇద్దరు నిందితులపై వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
News October 17, 2025
రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

బ్యాంకుల నుంచి రుణాలు అందజేయడం చేస్తూనే మరో వైపు ఇచ్చిన రుణాలను రికవరీ చేయించడం కూడా అధికారుల ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రుణాలను అందజేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపాలని, అప్పుడే పథకాలు విజయవంతంగా నడుస్తాయని అన్నారు. అదే సమయంలో రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు.
News October 17, 2025
దివిస్ కంపెనీలో విషవాయివుల లీక్

భీమిలి సమీపంలోని దివిస్ లేబరెటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్స్ అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు వినయ్ కుమార్, హేమంత్ని స్థానిక ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అపోలోకి తరలించారు.