News November 6, 2024
విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదే..
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును YCP అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1955లో బొబ్బిలి మండలం పక్కిలో జన్మించిన ఆయన 1983,85,94లో TDP ఎమ్మెల్యేగా, 2019లో YCP ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ప్రొటెం స్పీకర్, ప్రభుత్వ విప్ పదవులు కూడా నిర్వహించారు. ప్రధానంగా కొప్పలవెలమ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఆయనకు పేరుంది.
Similar News
News December 9, 2024
రైతులు అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్
విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం ఎవరూ వరి కోతలు చేయొద్దని, ఇప్పటికే కోసిన వారు కుప్పలు పెట్టాలని పేర్కొన్నారు. నూర్చిన ధాన్యం ఉంటే సమీప కొనుగోలు కేంద్రానికి ఇవ్వాలన్నారు. టార్పలిన్ అవసరం ఉన్నవారు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాలని కోరారు.
News December 7, 2024
విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి
విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.
News December 7, 2024
కంచరపాలెం అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్
విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.