News June 24, 2024
విజయనగరం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.
Similar News
News November 2, 2025
VZM: రెవెన్యూ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న దేవాలయాలు, ఏడాదిలో జరిగే ఉత్సవాల వివరాలు అందివ్వాలని అధికారులకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో శనివారం ఆయన స్పందించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్య, గతంలో జరిగిన దుర్ఘటనలు, తదితర అంశాలతో సర్వే చేసి నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
News November 2, 2025
ప్రైవేట్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
News November 2, 2025
పర్యాటక ప్రోత్సాహానికి హోమ్ స్టే విధానం: కలెక్టర్

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు nidhi.tourism.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


